ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో ముందడుగు

Published: Thursday December 06, 2018

అమరావతి: à°†à°Ÿà±‹ మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేయనుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ప్రతి ఏటా 3 లక్షల కార్లను కియా మోటార్స్‌ తయారు చేయనుంది. ఏపీలో ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కియా కంపెనీ సిద్ధమైంది. కియో మోటార్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే కార్లను రోడ్డుపైకి తెచ్చేలా కియా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.