రాష్ట్రంలో వైఎస్‌ పాలన తీసుకొస్తా

Published: Thursday October 11, 2018
 à°ªà±à°°à°œà°² ఆశీస్సులు ఉంటే రాబోయే 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం నాలుగురోడ్ల జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారు. నిజాయితీ à°—à°² నాయకుడు కావాలో, అబద్ధాలకోరు చంద్రబాబు కావా లో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు. 108 వాహనాల కొనుగోలులో భారీగా కమీషన్లు తీసుకున్నారని, టాటా కంపెనీరూ.12.5లక్షలకు కోట్‌ చేస్తే.. à°šà°‚ ద్రబాబు రూ.18లక్షలకు కొనుగోలు చేసి తన బినామీల కు లబ్ధిచేకూర్చారని ఆరోపించారు. ‘చంద్రబాబుకు అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం ఇస్తున్నట్లు పత్రికల్లో చూశాను. చాలా ఆశ్చర్యమనిపించింది. ఇదెలా ఉందంటే.. తాగొచ్చి రోజూ భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అని అవార్డు ఇస్తే à°Žà°‚à°¤ దారుణంగా ఉంటుందో అలా ఉంది’ అంటూ జగన్‌ విమర్శలు చేశారు.
 
à°ˆ సందర్భంగా సీఎంను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ‘దేశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే చంద్రబాబు లాంటి సీఎం మరెవరూ లేరు. ఆయనకు చెత్త ముఖ్యమంత్రి అవార్డు ఇస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. తాను సీఎం అయితే దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలన తీసుకువస్తానన్నారు. 30ఏళ్లు ముఖ్యమంత్రినై ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడతానని, తాను చనిపోయిన తర్వాత తన ఫొటోను రాజశేఖర్‌రెడ్డి పటం పక్కనే పెట్టుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు. 9 à°—à°‚à°Ÿà°² ఉచిత విద్యుత్‌, వడ్డీ లేని రుణాలు, ఖరీ్‌ఫకు ముందు మే నెలలోనే రూ.12,500 నగదు సాయం, సాగుకు బోరుబావులు ఉచితంగా మంజూరు చేస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తామని, నవరత్నాలతో పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.