ఢిల్లీలో విశాఖ విద్యార్థి ఆత్మహత్య

Published: Monday December 03, 2018
జీవితంలో à°¸ మున్నత శిఖరాలను అందుకోవాలనుకున్న à°† విద్యార్థి ఆశలను à°“ లెక్చరర్‌ ధనదాహం మింగేసింది. ప్రతి సె మిస్టర్‌కు తనకు రూ.5 వేలు ఇస్తేనే మార్కులు వేస్తానని లేకపోతే తప్పిస్తానని, పైగా ప్రాక్టికల్స్‌లోనూ ఫెయిల్‌ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో సదరు విద్యార్థి అటు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. వివరాలు.. విశాఖ జిల్లా ప్రద్మనాభం మండలంలోని మద్ది గ్రామానికి చెందిన నల్లి హేమంత్‌కుమార్‌(19) నాగ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కళాశాలలో ఫైర్‌ ఇంజనీరింగ్‌ తొలి సంవత్సరం చదువుతున్నాడు. నవంబరు 30à°¨ కళాశాలకు చెందిన అధ్యాపకుడు తనను వేధిస్తున్నాడని, దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ 3 పేజీల ఉత్తరం రాసి, తన తండ్రి వెంకట గోవర్ధనగిరి ఫోన్‌కు వాట్సా్‌పలో పెట్టాడు. తల్లిదండ్రులు వెంటనే ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్చాఫ్‌ చేసినట్టు వచ్చింది. వారు వెంటనే బయలుదేరి కళాశాలకు వెళ్లారు. 30à°¨ కళాశాల నుంచి వెళ్లిపోయినట్టు యాజమాన్యం చెప్పింది. ఇదిలావుంటే, ఆదివారం ఉదయం ఢిల్లీ పోలీసులు రైలుపట్టాలపై తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్న à°’à°• మృతదేహాన్ని కనుగొన్నారు. కళాశాల గుర్తింపు కార్డు ఆధారంగా కళాశాలకు ఫోన్‌ చేశారు.
 
 
à°† లెక్చరర్‌ను వదలొద్దు!
హేమంత్‌ వాట్సా్‌à°ª లేఖలో.. ‘‘నాన్నా నేను చనిపోతున్నాను. దీనికి కారణం.. మా కాలేజీ లెక్చరర్‌ ఆర్‌కే విధాత(ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్‌ బోధిస్తాడు). నన్ను చాలా బెదిరించాడు. ఒక్కో సెమిస్టర్‌à°•à°¿ రూ.5 వేల చొప్పున ఏడు సెమ్‌లకు రూ.35 వేలు ఇవ్వాలన్నాడు. లేకపోతే ప్రతి సెమ్‌లో రెండు బ్యాక్‌లాగ్స్‌ ఉంటాయి చూసుకో, ప్రాక్టికల్స్‌లో సంతకాలు కావాలన్నా నాదగ్గరకే రావాలి అని బెదిరించాడు. à°Žà°‚à°¤ బతిమాలినా రూ.5 వేలు ఎరేంజ్‌ చేయాలి లేకపోతే ఎగ్జామ్స్‌ కూడా వస్తున్నాయి, చూసుకోమరి జాగ్రత్త! అని బెదిరించాడు. నాకు బాగా ఏడుపొచ్చింది. చాలా టార్చర్‌ పెట్టాడు. అందుకే చనిపోవాలనుకున్నా. à°† లెక్చరర్‌ని వదలొద్దు’’ అని తన ఆవేదనను వెల్లడించాడు.