వేధింపులు తాళలేక హత్యచేసిన తండ్రి

Published: Tuesday December 04, 2018
విడవలూరు: à°ªà±à°¨à±à°¨à°¾à°® నరకం నుంచి తప్పించుకోవడానికి పుత్రుడు జన్మించాలని అంటారు!. అందుకే కాబోలు.. ఇద్దరు కూతుళ్లు పుట్టాక కొడుకు కోసం పరితపించిపోయాడా తండ్రి!!. కోరుకున్నట్లే కొడుకు పుట్టడంతో సంబరపడిపోయాడు!. పుట్టిననాటి నుంచి గుండెలమీద పెంచుతూ అతడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంటూ వచ్చాడు!. సర్వస్వం ధారబోసి చదివించాడు. అయితే కన్నకొడుకు చెడు వ్యసనాలకు బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతో సహనం కోల్పోయాడు. చేతికి దొరికిన రోకలిబండతో కొట్టి హతమార్చాడు. నెల్లూరుజిల్లా విడవలూరు మండలం చౌకచర్లలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. చౌకచర్లకు చెందిన ఎళ్లు వెంకయ్య రైతు. అతడికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు కాగా, కొడుకు కిరణ్‌(35). అతడిని కష్టపడి చదివించి దంత వైద్యుడిగా తీర్చిదిద్దాడు.
 
 
ప్రస్తుతం కిరణ్‌ నెల్లూరు బీవీనగర్‌లోని à°“ ప్రైవేటు దంత వైద్యశాలలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐదేళ్లక్రితం కిరణ్‌ ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత చెడు వ్యసనాలకు బానిసైన కిరణ్‌ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. à°† తర్వాత కిరణ్‌ తల్లిదండ్రులనూ హింసిస్తున్నాడు. కన్నకొడుకే కావడంతో భరిస్తూ వస్తున్నారు. à°ˆ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి కిరణ్‌ మద్యం సేవించి యథావిధిగా తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. సహనం కోల్పోయిన తండ్రి వెంకయ్య.. పక్కన ఉన్న రోకలిబండతో కుమారుడి తలపై కొట్టాడు. దీంతో రక్తస్రావమై కిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. à°ˆ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అల్లారుముద్దుగా పెంచిన కొడుకును తండ్రే హతమార్చడంపై స్థానికులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. కోవూరు పోలీసులు సోమవారం ఉదయం కిరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.