విద్యార్థిపై యాసిడ్ దాడి...
Published: Saturday December 08, 2018

గాజువాక: విశాఖపట్నం గాజువాక శ్రీనగర్‌లో విద్యార్థిపై యాసిడ్ దాడి కలకలం రేపుతోంది. శ్రీచైతన్య కాలేజి విద్యార్థి ప్రవీణ్‌కుమార్‌పై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌తో దాడి చేశారు. దుండగులు బైక్‌పై వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అది బాత్‌రూమ్ యాసిడ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Share this on your social network: