రోగుల ప్రాణాలతో క్రూర చెలగాటం

Published: Friday December 14, 2018
రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 241 మెడికల్‌ షాపుల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అందులో 96 దుకాణాల్లో గడువు దాటిన మందులు విక్రయిస్తున్నట్లు తేలింది. లైసెన్స్‌ లేకుండా మూడు మెడికల్‌ షాపులు మందులు విక్రయిస్తుండగా, నిషేధిత మందులు నాలుగు షాపుల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు.
 
మందుల కంపెనీలు ఇచ్చే శాంపిల్స్‌ను 22 చోట్ల విక్రయిస్తున్నారని, మరో 21 షాపుల్లో ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచాల్సిన మందులను బయట పెట్టి వాటి ప్రాణం తీశారని తనిఖీలకు వెళ్లిన విజిలెన్స్‌ అధికారులు వివరించారు. ఒక్క మందులేకాదు, చిన్నపిల్లల ఆహారం, సర్జికల్స్‌ కూడా గడువు తీరినవి మెడికల్‌ షాపుల్లో విక్రయిస్తున్నారని గుర్తించారు. ఫార్మసిస్టులు ఉండాలన్న నిబంధనను దాదాపు 80 మెడికల్‌ షాపు ల్లో ఉల్లంఘిస్తుండగా, డాక్టరు రాసిచ్చిన చీటీ లేకుండానే కొన్ని మందులను చాలా షాపుల్లో విక్రయించేస్తున్నారు. ఎక్కడి నుంచి కొంటున్నామో, ఎవరికి విక్రయిస్తున్నామో చెప్పకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్డగోలు వ్యవహారాలకు తెగబడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం మామూ ళ్ల మత్తులో జోగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 
మందుల షాపుల్లో విక్రయించే వాటి వివరాలు కచ్చితంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలి. కానీ ఎక్కడా à°† పని జరగడంలేదు. మత్తు కలిగించే మందులు సైతం శ్రీకాకుళంలో డాక్టర్‌ రశీదు లేకుండా విక్రయిస్తున్నారని à°† జిల్లా విజిలెన్స్‌ అధికారి హరికృష్ణ తెలిపారు. చిన్నపిల్లలకు స్పూన్‌తో అందించే పొడి మొదలుకొని గర్భిణుల పౌష్టికాహారం దాకా.. గడువు తీరినవే విక్రయిస్తున్నారని చెప్పారు. శిశు, గర్భిణులకు ఇచ్చే ఆహారం మెడికల్‌ షాపుల్లో విక్రయించాలంటే ప్రత్యేక లైసెన్స్‌ ఉండాలి. కానీ ఎక్కడా అనుమతులు కనిపించడం లేదన్నారు. తనిఖీల్లో భాగంగా పరిశీలించగా, షాపుల్లోని ఇన్వాయి్‌సలో పేర్కొన్న మందుల బ్యాచ్‌ నెంబర్లతో దుకాణంలో ఉన్న మందులపై బ్యాచ్‌ నంబర్లు సరిపోవడంలేదు. మెడికల్‌ షాపు à°’à°•à°°à°¿ పేరుతో ఉంటే జీఎస్టీ మరొకరి పేరుతో ఉంటోం ది. లేబర్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ అనేది దాదాపు లేదు.