బాంబుల కలకలం
Published: Friday December 21, 2018

పల్నాడు: గుంటూరు జిల్లా పల్నాడులో బాంబులు కలకలం రేపాయి. రెంటచింతల మండలం మంచికల్లులో 15 నాటుబాంబులను పోలీసులు సీజ్ చేశారు. ఈ బాంబులను వైసీపీ కార్యకర్త నరసింహారావు ఇంట్లో గుర్తించారు. మంచికల్లు పోలేరమ్మ జాతర సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విస్తృత తనిఖీలు చేశారు. నరసింహారావు ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో కారు కింద ప్లాస్టిక్ బకెట్‌లో దాచిన బాంబులు కనబడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 నాటు బాంబులు లభ్యం కావడంతో ఒక్కసారిగా మంచికల్లులో కలకలం రేగింది. ఈ కేసులో నిందితుడు నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు గ్రామంలో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.

Share this on your social network: