ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.17.50 లక్షలు స్వాహా

ఏపీ సీఆర్డీఏలో ఉద్యోగాలు ఇప్పిస్తానం టూ నిరుద్యోగ యువతను మోసం చేసి రూ.17.50 లక్షలు స్వాహా చేసి పరారై న దంపతులపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన చీలి సతీష్, భార్య నవనీత ఓ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నామని నమ్మిం చారు. నకి లీ ఐడీలు సృష్టించి తమ బంధువులు సీఆర్డీఏలో పని చేస్తున్నారని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతకు వల విసిరారు. దంపతులు చెప్పిన మాటలు నమ్మిన యువత దాదాపు రూ.17.50 లక్షలు చెల్లించారు. బాధితుల్లో ఒక న్యాయ వాది భార్య కూడా ఉంది. హనుమాన్‌జంక్షన్, గోసాల మైలవ రానికి చెందిన బాధితులు రెండు రోజుల క్రితం వణుకూరు దంపతుల ఇంటికి చేరుకోగా ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. దీంతో వారి ఆచూకీ కోసం వెతికిన బాధితులు సాయికుమార్, ఎస్.సుభాషిణి, దివాకర్, సతీష్‌బాబు, దుర్గారావు, రవికిషోర్, తులసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this on your social network: