గోమాతపై లైంగిక దాడి.. పిఠాపురంలో దారుణం

Published: Monday December 24, 2018

గోమాతపై మనిషి లైంగికదాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నామా బుచ్చిరాజు బి.కొత్తూరు రోడ్డులోని తన పశువులపాకలో శనివారం రాత్రి మూడు ఆవులు, రెండు గిత్తలు, ఒక దూడను కట్టేసి ఇంటికొచ్చి పడుకున్నాడు. తెల్లవారుజామున పాక వద్దకు వెళ్లి చూడగా పశువులు కనిపించలేదు. సమీపంలోని తాడిచెట్టుకు కట్టేసి ఉన్న తన ఆవు ఒకటి కదల్లేని స్థితిలో కనిపించింది. మూడు నెలల గర్భంతో ఉన్న ఆ గోమాత ఆవు మర్మాంగం వద్ద రక్తపు గాయాలు కనిపించడంతో లైంగికదాడి జరిగినట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవుకు పరీక్షలు నిర్వహించిన పశువైద్యాధికారి తిరుమలరావు కూడా లైంగికదాడిని నిర్ధారించారు.