మద్యం మత్తులో దారుణం

Published: Thursday January 17, 2019

గంగవరం: విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో వేర్వేరు చోట్ల రెండు హత్యలు జరిగాయి. గంగవరంలో ఆటోడ్రైవర్‌ ధనరాజును పల్లి నరేష్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశారు. విషయం తెలిసిన పోలీసులు నిందితుడు పల్లి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే భీమిలి మంచిననాగయ్యపాలెంలో సతీష్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సతీష్‌ను కొందరు దుండగులు మద్యం బాటిల్‌తో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.