పెళ్లిని ఆపాలని యువతి పోరాటం

Published: Friday February 08, 2019
 ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. తరువాత సమీప బంధువైన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి సిద్దపడ్డాడు. ఇదేంటని నిలదీసినందుకు కులంపేరుతో దూషించాడని ఓ యువతి, జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. చిక్కడపల్లి పోలీస్టేషన్‌లో ఐపీసీ 376, 379 సెక్షన్ల (అత్యాచారం, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారం నిరోధక చట్టం) కింద ఆగస్టు 3న కేసు నమోదైంది.
 
కేసును నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు నిందితుడు దోమల్‌గూడకు చెందిన పి. సత్యనారాయణ(29)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు కారణంగా నిర్ణయించిన పెళ్లి రద్దయింది. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన సత్యనారాయణ రాజమండ్రి ప్రాంతానికి చెందిన మరో యువతితో ఫిబ్రవరి 9న పెళ్లికి సిద్దమయ్యాడని యువతి ఆరోపిస్తోంది. తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనీ, తనకు న్యాయం చేయాలని, మరో యువతితో ఇతని పెళ్లి జరగకుండా ఆపాలని ఆమె కోరుకుంటుంది. తనను మోసం చేసిన వ్యక్తికి బెయిల్‌ రద్దు చే యడంతోపాటు, కేసును త్వరగతిన విచారించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతోంది.