జ్యోతి హత్య కేసు..అదుపులో నిందితుడు

Published: Saturday February 23, 2019

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జ్యోతి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి నుంచి శ్రీనివాస్ డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో నిందితులను ఈరోజు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 11న మంగళగిరి శివారులో జ్యోతి హత్యకు గురైంది. ప్రియుడు శ్రీనివాస్‌ పథకం ప్రకారం జ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.