బాత్‌రూమ్‌లో విజయారెడ్డి మృతదేహం

Published: Wednesday February 27, 2019

కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు భోగసముద్రం విజయారెడ్డి(53) తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం హత్య విషయం బయటకు à°ªà±Šà°•à±à°•à°¿à°¨à°ªà±à°ªà°Ÿà°¿à°•à±€ సోమవారమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలిగా చాలాకాలం పనిచేశారు. ఇప్పటికీ à°† పార్టీలోనే కొనసాగుతున్నా.. క్రియాశీలకంగా లేరు.భర్త బీవీ నారాయణరెడ్డి ఎస్‌బీఐ ఉద్యోగి. వివాహిత అయిన వారి కుమార్తె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. విజయారెడ్డి దంపతులు ప్రస్తుతం నివసిస్తున్న అక్కయ్యపాలెం ఎన్‌జీజీవోస్‌ కాలనీలోని పద్మభాస్కర్‌ ప్రకాష్‌ రెసిడెన్సీ అపార్టుమెంట్‌ ఫ్లాట్‌ నంబర్‌ 502ను ఇటీవల అమ్మకానికి పెట్టారు. à°ˆ మేరకు భీమిలి ప్రాంతానికి చెందిన హేమంత్‌, రాధిక కలిసి à°ˆ నెల 23à°¨ ఉదయం 8 గంటలకు ఫ్లాట్‌ కొనుగోలుకని వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు. తర్వాత సోమవారం ఉదయం 9 à°—à°‚à°Ÿà°² సమయంలో పల్సర్‌ బైక్‌పై à°“ వ్యక్తి వచ్చాడు. 502 ఫ్లాట్‌ కొనేందుకు వచ్చానని వాచ్‌మన్‌ ఈశ్వరరావుకు చెప్పడంతో అతడిని పైకి తీసుకువెళ్లి వెనుదిరిగాడు.

 
మధ్యాహ్నం రెండు, రెండున్నర à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో విజయారెడ్డి భర్త ఇంటికి వచ్చేసరికి బయట తాళం వేసి ఉంది. ఆమె సెల్‌కు ఫోన్‌ చేసినా.. స్పందన లేకపోవడంతో వాచ్‌మన్‌ను అడిగాడు. పార్కింగ్‌ వద్ద కారు లేకపోవడంతో ఆమె బయటకు వెళ్లి ఉంటుందని వాచ్‌మన్‌ చెప్పాడు. మంగళవారం ఉదయం విజయారెడ్డి భర్త నారాయణరెడ్డి అపార్టుమెంట్‌ వాసులను పిలిచి తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్లి చూసేసరికి బెడ్‌రూమ్‌కు ఆనుకుని ఉన్న బాత్‌రూమ్‌లో విజయారెడ్డి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. దుండగుడు బెడ్‌రూమ్‌లో హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోకి ఈడ్చుకువెళ్లి వదిలేశాడు.