పెళ్లికి ఒప్పుకోలేదని ఆటోడ్రైవర్‌ ఘాతుకం

Published: Thursday April 18, 2019
 à°¤à°¨à°¤à±‹ ప్రేమ, పెళ్లికి ఒప్పుకోలేదన్న అక్కసుతో à°“ ఆటో డ్రైవర్‌ యువతి మెడకు చున్నీ బిగించి హత్యయత్నానికి పాల్పడ్డారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం శివరామరాజుపేట లో బుధవారం à°ˆ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల à°•à°¥ నం ప్రకారం.. వేపాడ మండలం ఆకుల సీతంపేటకు చెందిన యువతి శృంగవరపుకోటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నతనంలో నే తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి గంట్యాడ మండలం మధుపాడలోని అమ్మమ్మ వద్ద ఉంటోంది. అప్పుడప్పుడూ ఆకుల సీతంపేటలో ఉంటున్న నాయనమ్మ వద్దకు వచ్చి, అక్కడి నుంచి కళాశాలకు వెళ్లేందు కు ఇదే గ్రామానికి చెందిన సుంకరి బంగారు బుల్లయ్య ఆటోను ఆశ్రయించేది. à°ˆ పరిచయంతో బుల్లయ్య ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించేవాడు.
 
à°ˆ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు గ్రామపెద్దల దృష్టిలో పెట్టగా వారు 2 నెలల కిందట బుల్లయ్యను హెచ్చరించారు. ఆమె బుధవారం శివరామరాజు పేటలో ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. ఆమె రాకను తెలుసుకున్న బుల్లయ్య అక్కడికి వచ్చాడు. ఆమె à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ ఇంట్లో ఉండడం గమనించి.. పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. బదులివ్వకపోవడంతో చున్నీని ఆమె మెడకు గట్టిగా బిగించాడు. నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. చనిపోయిందనుకుని బుల్లయ్య పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.అమ్మినాయుడు తెలిపారు.