భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని..

Published: Sunday May 26, 2019
జిల్లాలోని వి.కోటలో దారుణం జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తీవ్ర ఆగ్రహంతో గడ్డపారతో భర్త హతమార్చాడు. à°ˆ ఘటన స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకెళితే... వి.కోట మండలం దాసార్లపల్లి గ్రామంలోని శ్రీనివాసులు, వసంతకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ట్రాక్టర్ డ్రైవర్‌à°—à°¾, భార్య తాపీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తుండేవారు.
 
అయితే కూలి పనులకు వెళ్తున్న భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసి ఆగ్రహంతో భార్య తలపై గడ్డపారతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటనతో ఇద్దరి పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న వసంత కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 
à°ˆ ఘటన జరిగిన అనంతరం అనగా ఆదివారం ఉదయం నేరుగా వి.కోట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన శ్రీనివాసులు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీయగా.. తన భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అందుకే హతమార్చానని నిందితుడు చెప్పాడు. వి. కోట అర్బన్ సీఐ వెంకట రామిరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా à°ˆ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.