ముగ్గుర్నీ చంపి.. వారి రక్తంతో శివలింగానికి అభిషేకం..

Published: Tuesday July 16, 2019
 à°’కే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆదివారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. హతుల్లో తమ్ముడు, ఇద్దరు అక్కలున్నారు.చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని కొర్తికోట గ్రామ సమీపంలోని శివాలయంలో à°ˆ కిరాతకం జరిగింది. తమ్ముడు తంబళ్లపల్లెకు సుపరిచితుడు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కదిరి డీఎస్పీ శ్రీనివాసులు కథనం మేరకు.. కొర్తికోటకు చెందిన కమలమ్మ(75) గ్రామ సమీపంలోని పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అందుకు మదనపల్లెలో ఉంటున్న తమ్ముడు శివరామిరెడ్డి (65), బెంగళూరులో ఉంటున్న చెల్లెలు సత్యలక్ష్మి (70) సాయం కోరారు. అందరూ కలిసి ఆలయ బాగోగులు చూసుకుంటున్నారు. కమలమ్మ ఆలయం వద్దే ఉంటుండగా.. తమ్ముడు, చెల్లెలు వస్తూ పోతూ ఉండేవారు. సోమవారం పూజల నిమిత్తం ఆదివారం రాత్రి ముగ్గురూ ఆలయానికి చేరుకుని అక్కడే నిద్రించారు. తెల్లవారేసరికి ముగ్గురినీ దుండగులు కత్తితో గొంతు కోసి, చాతీపై గాట్లు పెట్టి హత్యచేశారు. తర్వాత వీరి రక్తంతో ఆలయంలోని శివలింగాన్ని, ఎదురుగా ఉన్న పుట్టకు అభిషేకం చేశారు. అనంతరం దుండగలు అక్కడే ఉన్న తొట్టెలో మునిగి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు.