ఒక్క ఆడపిల్ల కూడా లేకపోవడం సంచలనం రేపింది

Published: Monday July 22, 2019
132 గ్రామాల్లో ఒక్క బాలిక కూడా జన్మించక పోవడంపై గల కారణాలపై తాము ఆయా గ్రామాల్లో సమగ్ర సర్వే చేస్తామని జిల్లా కలెక్టరు డాక్టర్ ఆశిష్ చౌహాన్ చెప్పారు.ఒక్క ఆడపిల్ల కూడా జన్మించక పోవడాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టరు ఆషా కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. 132 గ్రామాల్లో జననాలపై ప్రత్యేక దృష్టి సారించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టరు ఆషా కార్యకర్తలు, అధికారులను ఆదేశించారు.
 
132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టకపోవడంపై సామాజికవేత్త కల్పనా ఠాకూర్ స్పందించారు. ప్రసవానికి ముందే గుర్తించి కడుపులోనే బాలికలను భ్రూణ హత్యలు చేస్తున్నందు వల్లే ఆడబిడ్డలు పుట్టలేదని కల్పనా ఆరోపించారు. ఆడపిల్లల భ్రూణ హత్యలు కొనసాగుతున్నందువల్లే ఆడబిడ్డలు పుట్టటం లేదని సీనియర్ జర్నలిస్టు శివసింగ్ ఆరోపించారు. భ్రూణ హత్యలను నివారించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని శివసింగ్ డిమాండు చేశారు. 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్ల జన్మించక పోవడం వల్ల బేటీ బచావో బేటీ పడావో కేంద్ర పథకం అమలు ప్రశ్నార్థకంగా మారిందని శివసింగ్ చెప్పారు.