లంచం వెనక్కి ఇచ్చేస్తున్న అధికారి..

Published: Sunday July 28, 2019
ఆయన గతంలో రాయచోటి తహసీల్దార్‌à°—à°¾ పని చేశారు. అప్పట్లో ఆయన చేసిన ఘనకార్యాలు అన్నీ ఇన్నీ కావు. డీకేటీ పట్టాలు అనర్హులకు ఇవ్వడం.. ఎన్నో ఏళ్లుగా ఇతరుల అనుభవంలో ఉన్న భూములను మరెవరికో కట్టబెట్టడం.. కోర్టు పెండింగ్‌లో ఉన్న భూములను సైతం ఆన్‌లైన్‌ చేయడం.. లేని భూమికి పట్టాదారుపాసుపుస్తకాలు ఇచ్చి ఆన్‌లైన్‌ చేయడం.. తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులను బయట తన సొంత గదిలో పెట్టుకోవడం.. కోర్టును సైతం తప్పుదోవ పట్టించడం... ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఘనతలన్నీ పెద్ద జాబితానే అవుతుంది. ఇలాంటి పనులతో ఆయన సుమారు పది కోట్లకు పైనే సంపాదించారని సమాచారం. అటువంటి అవినీతిచక్రవర్తి తాను తీసుకున్న లంచం తిరిగి ఇచ్చేశాడు.. ఇది వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిని సహించేది లేదని పలుమార్లు ప్రకటించారు. à°ˆ మాటలు విని సదరు తహసీల్దార్‌ మనసు మార్చుకున్నాడనుకుంటే పొరబాటే.. అవినీతికి పాల్పడేందుకు భయపడ్డాడేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. మరి ఎందుకని à°ˆ సారు లంచం వెనక్కి ఇచ్చేశాడని ఆరా తీయగా.. ఆసక్తికర విషయం తెలిసింది.
 
గతంలో ఆయన రాయచోటిలో పనిచేసినపుడు నిబంధనలతో సంబంధం లేకుండా.. ఎటువంటి పనులైనా చేసిపెడతానని పలువురి దగ్గర లంచాలు తీసుకున్నారు. అంతలోనే ఇక్కడి నుంచి బదిలీ అయిపోయారు. దీంతో లంచాలు ఇచ్చిన వాళ్లు లబోదిబోమన్నారు. తమ దగ్గర నుంచీ తీసుకున్న లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చేయమని డిమాండ్‌ చేశారు. దీనికి à°† తహసీల్దార్‌ సారు.. మీరు భయపడవద్దు.. నేను మళ్లీ ఇక్కడికే వస్తా.. మీ పనులు చేసి పెడతా అని భరోసా ఇచ్చారు. à°ˆ నేపధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డంతో ఆయన రాయచోటికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అధికార పార్టీలోని చోటామోటా నాయకులతో సిపార్సు చేయించుకున్నారు. అయితే గతంలో ఆయన ఆగడాలు, ఆకృత్యాలపై ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా పలు కథనాలు ప్రచురించింది. ఇవన్నీ తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన రాయచోటికి రావడానికి అంగీరించలేదు. ఇటువంటి అధికారులతో జనంలో మనకు చెడ్డపేరు వస్తుంది అంటూ.. à°† తహసీల్దార్‌ కోసం సిపార్సు చేసిన నాయకులను హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో à°† తహసీల్దార్‌ విధిలేక తాను తీసుకున్న లంచంలో కొందరికి రూ.18లక్షలు వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. ఇటువంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం à°ˆ విషయమే రాయచోటిలో పెద్ద చర్చగా ఉంది.