వివాహేతర సంబంధమే హత్యకు కారణం

Published: Sunday July 28, 2019
 à°µà°¿à°µà°¾à°¹à±‡à°¤à°° సంబంధం ఇద్దరు వ్యక్తుల స్నేహాన్ని చెడగొట్టడమే కాకుండా à°’à°•à°°à°¿ దారుణ హత్యకు దారి తీసింది. తణుకు మండలం దువ్వలోని సూర్యారావుపాలెం రోడ్డులో బ్రాందిషాపు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన హత్యను తణుకు పోలీసులు ఛేదించారు. శనివారం తణుకు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ కే.రాజేశ్వరరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. మొగల్తూరు గ్రామానికి చెందిన గుడాల శివరామకృష్ణ, దువ్వ గ్రామానికి చెందిన కామన బాలాజీ(25)లు గతంలో గల్ఫ్‌ దేశం ఉపాధి నిమిత్తం వెళ్లి స్నేహితులయ్యారు. తిరిగి స్వగ్రామానికి వచ్చిన అనంతరం రామకృష్ణ సహజీవనం చేస్తున్న యువతితో బాలాజీ స్నేహం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు.
 
విషయం తెలుసుకున్న శివరామకృష్ణ స్నేహితుడిని పలుసార్లు హెచ్చరించాడు. వినకపోవడంతో à°† యువతిని గల్ఫ్‌ దేశానికి పంపించాడు. అయినా బాలాజీ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడంతో విషయాన్ని బాలాజీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడు. ఫలితం లేకపోవడంతో కక్ష పెంచుకున్న శివరామకృష్ణ శుక్రవారం బాలాజీని కలిసి ఇదే విషయమై మాట్లాడుకున్నారు. రాత్రి 9 గంటలకు దువ్వ బ్రాంది షాపులో ఇద్దరు మద్యం తాగారు. à°† సమయంలో బాలాజీ అతని ముందే à°† యువతితో ఫోన్‌లో మాట్లాడడంతో శివరామకృష్ణ ఆగ్రహంతో à°Šà°—à°¿ పోయాడు. వెంటనే తన దగ్గరున్న పదునైన చాకుతో బాలాజీ పీకపై పొడిచి పరారయ్యాడు. బాలాజీ వైన్‌షాపు ఆవరణలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది గాలించి ముద్దాయి శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
 
 
వివాహేతర సంబంధానికి కారణమైన యువతి గతంలో వ్యభిచార వృత్తిని కొనసాగించినట్టు సమాచారం. ఎనిమిదేళ్ల క్రితం తాడేపల్లిగూడెంలో వ్యభిచార వృత్తిలో ఉన్న సమయంలోనే ముద్దాయి శివరామకృష్ణతో పరిచయం ఏర్పడింది. à°† పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అప్పటినుంచి ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. గల్ఫ్‌ దేశంలో ఏర్పడిన పరిచయంతో తాడేపల్లిగూడెంలో ఉంటున్న వీరి నివాసం వద్దకు బాలాజీ తరచూ వెళుతుండేవాడు. à°† క్రమంలో సదరు యువతితో వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై పలుసార్లు శివరామకృష్ణ బాలాజీని హెచ్చరించాడు. అయినా మాట వినకపోవడంతో యువతిని గల్ఫ్‌కు పంపించాడు. కానీ తరచూ ఫోన్‌లు చేయడంతో కక్ష పెంచుకున్న ముద్దాయి శుక్రవారం రాత్రి బాలాజీని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ముద్దాయిని వెంటనే అదుపులోకి తీసుకోవడానికి కృషి చేసిన తణుకు సీఐ చైతన్యకృష్ణను రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావును సిబ్బందిని కొవ్వూరు డీఎస్పీ కే.రాజేశ్వరరెడ్డి అభినందించారు. శనివారం అరెస్టు చేసిన నిందితుడు శివరామకృష్ణ కోర్టును హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్‌ విధించారు. కాగా బాలాజీ మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.