గల్ఫ్‌లో ఉద్యోగమని వెళ్తే.. వ్యభిచార రొంపిలోకి

Published: Monday August 19, 2019
పెంటపాడు మండలానికి చెందిన మరో మహిళ కువైట్‌ వెళ్లింది. విజిటింగ్‌ వీసా కాలం చెల్లిపోవడంతో బాబా ఐదుగురి యజమానులకు అమ్మేశాడు. ఒక్కోరోజు తిండి ఉండేది కాదు. వాంతులు వస్తే ఇంటి యజమానులు అనుమానంతో పరీక్షలు నిర్వహించేవారు. ఇలా మానసికంగా వేధింపుల పాలైంది. ఒక్కపూట తిండితో నెలలు గడిపింది. చివరకు ఆమె కుటుంబసభ్యులు ప్రవాసాంధ్రుల సహాయ కేంద్రాన్ని ఆశ్రయించి మహిళను సొంత గ్రామానికి రప్పించుకోగలిగారు.
 
ఇలా గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వందలాది మంది బాధితులు రోడ్డున పడుతున్నారు. గృహహింసలు అనుభవిస్తున్నారు. శారీరక వేధింపులకు లోనవుతున్నారు. తాజాగా రాష్ర్టానికి చెందిన ఐదుగురు మహిళలు గల్ఫ్‌లో చిక్కుకుపోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రభుత్వం స్పందించింది. మహిళలను గుర్తించారు. వారిని పంపిన ఏజెంట్ల వేట ప్రారంభించారు. జిల్లాలో 421 మంది నకిలీ ఏజెంట్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ హెచ్చరించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడు గతంలో హడావుడి చేసిన సందర్భాలు అనేకం ఉంటున్నాయి. à°† తర్వాత సమస్యను పట్టించుకునే సందర్భాలు ఉండడం లేదు. పోలీస్‌ యంత్రాంగాన్ని ఏజెంట్లు ప్రసన్నం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉంటున్నాయి. అందుకే గల్ఫ్‌లో చిక్కుకున్న బాధితులు స్వదేశాలకు రావడానికి సహాయ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ఏజెంట్లు మోసాలకు తెగబడుతున్నారు.
 
 
గల్ఫ్‌ దేశాల్లో ముఖ్యంగా మహిళలు ఇంటి పనికోసం వెళుతుంటారు. మగవాళ్లయితే డ్రైవర్‌లు, రెస్టారెంట్‌లు, షాపింగ్‌ మాల్స్‌లో ఉద్యోగాలంటూ ఏజెంట్‌లు నమ్మబలుకుతారు. తీరా వెళ్లేసరికి అక్కడ ఉద్యోగం ఉండదు. గల్ఫ్‌ దేశాల్లోని ఎడారుల్లో ఒంటెలు మేపడం, గుర్రాలకు సేవలు చేయడం, మేకలు మేపే ఉద్యోగాలు చేస్తుంటారు. అక్కడ ఉష్ణోగ్రతలు తట్టుకోలేక అనారోగ్యం బారిన పడుతుంటారు. నర్సాపురం నియోజకవర్గానికి చెందిన ఎంతో మంది యువత ఏజెంట్‌లో చేతిలో మోసపోయారు. ఉపాధి లేక తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఏజెంట్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు సదరు ఏజెంట్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలా జిల్లాలో బాధిత కుటుంబాల అందరిదీ ఇదే దుస్థితి. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే న్యాయం జరగదన్న అభిప్రాయం గల్ఫ్‌ బాధితుల్లో గూడు కట్టుకుంది.
 
విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా మహిళలను ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు పంపుతున్నారు. జిల్లా నుంచి దాదాపు 30 వేల మంది గల్ఫ్‌ దేశాల్లో ఉంటారని అంచనా. అందులో సింహభాగం మహిళలే. పాస్‌పోర్ట్‌ సంపాదించి విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌కు పయనమైపోతున్నారు. గరిష్టంగా మూడు నెలల వరకు విజిటింగ్‌ వీసా పని చేస్తుంది. à°† తర్వాత పుషింగ్‌ వీసా కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. లేదంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకుని అకామా తీసుకుంటారు. ఇది కూడా à°’à°• విధంగా వీసా లాంటిదే. అయినా వేతనాలు సరిగా ఇవ్వకపో వడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఏజెంట్లు తమ వద్దే పాస్‌పోర్ట్‌ ఉంచుకుంటారు. దీనివల్ల మహిళలు బయటకు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. గల్ఫ్‌ దేశాల్లో ఇంటి పనికి వేలల్లో వేతనం అంటూ ఏజెంట్‌లు మహిళలకు à°Žà°° వేస్తుంటారు. విజిటింగ్‌ వీసాను సంపాదిస్తారు. తీరా గల్ఫ్‌ దేశం వెళ్లాక అక్కడ రూ.10 వేలకు మించి వేతనం ఉండదు. విజిటింగ్‌ వీసా పూర్తయిన తర్వాత చట్ట ప్రకారం అక్కడ ఉండేందుకు వీలులేదు. మహిళలకు అప్పుడే కష్టాలు ప్రారంభమవుతాయి. అనధికారికంగా ఉండాల్సిన దుస్థితి.
 
గల్ఫ్‌లో బాబాలు ఇటువంటి మహిళలను రహస్యంగా ఇంటి యజమానులకు విక్రయిస్తుంటారు. అందుకోసం రూ.50 వేల వరకు తీసుకుంటారు. అదే సక్రమంగా వెళ్లాలంటే అగ్రిమెంట్‌ కుదుర్చుకోవాలి. అందుకోసం ఇంటి యజమానులు రూ.2 లక్షల వరకు వెచ్చించాలి. అధికారికంగా వెళితే వీసా ముందుగానే మంజూరవుతుంది. ఇదంతా కాస్త సమయం తీసుకుంటుంది. అగ్రిమెంట్‌ చేసుకుంటే గల్ఫ్‌లో ఇంటి యజమానులు ఖచ్చితంగా వేతనాలు చెల్లించాలి. వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తే యజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.