అనుమానపు ప్రియుడు పొడిచేశాడు

Published: Thursday August 29, 2019
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు.. అయితే జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అని షరతు పెట్టారు. కానీ అబ్బాయి ఆ ప్రయత్నం చేయలేదు సరికదా.. తాగి తిరుగుతూ అమ్మాయిపై అనుమానం పెంచుకున్నాడు. రోజూ వేధిస్తూ ఆమెను మానసిక క్షోభకు గురిచేశాడు. చివరకు కత్తితో దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు..
 
పట్టణంలోని భీమునిగుమ్మం ప్రాంతానికి చెందిన పొట్ల యశోదభార్గవి (బీకాం ఫస్టియర్‌), కందలాడ సాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి గతేడాది రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు. అయితే డిగ్రీ పూర్తిచేసిన సాయి ఉద్యోగం చూసుకుని జీవితంలో స్థిరపడాలని యశోదభార్గవి తల్లిదండ్రులు షరతుపెట్టారు. కానీ.. సాయి ఏ పనీ చేయకుండా తాగి తిరుగుతుండడంతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. à°ˆ నేపథ్యంలో భార్గవి ఎవరితో మాట్లాడినా సాయి అనుమానించేవాడు. ఆమె సెల్‌ఫోన్‌ తీసుకుని చెక్‌ చేసేవాడు. బయటకు తీసుకెళ్లి మాటలతో హింసించేవాడు.
 
దీంతో కొంతకాలం నుంచి భార్గవి అతనితో మాట్లాడడం లేదు. à°ˆ నేపథ్యంలో సాయి బుధవారం సాయంత్రం భార్గవి చదివే కాలేజీ వద్ద కాపుకాశాడు. ఆమె బయటకు రాగానే తన వెంట రావాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి.. దుర్గా లాడ్జి వీధి జంక్షన్‌లో కత్తి తీసి ఆమె పొట్ట, పీక, నడుముపై పొడిచాడు. à°† సమయానికి à°† ప్రాంతంలోనే ఉన్న విద్యార్థిని బంధువులు.. సాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భార్గవిని చికిత్స నిమిత్తం ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. ఆమెకు ప్రాణహాని లేదని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.