రాష్ట్రంలో అబలల ఆచూకీ గల్లంతు

Published: Tuesday September 03, 2019
ఇంటి నుంచి బయటికి వచ్చిన వారు మళ్లీ ఇంటికి చేరడం లేదు! అపహరణకు గురయ్యారా? ఏ ముంబైలోనో చేరకూడని ‘గూటి’à°•à°¿ చేరారా? అసలు ఉన్నారా? లేదా? ఇవన్నీ ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలు. à°ˆ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 15à°µ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 2169 మంది బాలికలు, యువతులు, మహిళలు కనిపించకుండా పోయారు. అంటే... సగటున రోజుకు 10 మంది ఆచూకీ గల్లంతవుతోంది. గతంలో మహిళలు, యువతులు, బాలికల మిస్సింగ్‌ కేసుల్లో ఆచూకీ 90 శాతానికి పైగా ఉండేది. ఇప్పుడు అది 40 శాతానికి పడిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
కరువు కాటకాలతో సతమతమయ్యే రాయలసీమ నుంచి ఈ ఏడాది 643 మంది అబలలు గల్లంతయ్యారు. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతిపెద్దదైన అనంతపురం జిల్లాలో మహిళల్ని కరువు రక్కసి కాటేస్తోంది. ఆకలి తీరని పేద మహిళలు దళారుల మాయలో పడి ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో వ్యభిచార గృహాలకు అమ్ముడు పోతున్నారు. గడిచిన ఏడు నెలల్లో కనిపించకుండా పోయిన మహిళల్లో అత్యధికంగా 261 మంది అనంతపురం జిల్లాకు చెందిన వారే. ఇందులో యువతులు - బాలికల సంఖ్య వందకుపైగానే ఉంది. ఇక... కడప జిల్లా రాయచోటి ప్రాంతంలోనూ ఈ సమస్య ఎక్కువే. చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది ఇంటి నుంచి బయటికెళ్లిన వారిలో వంద మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
 
అనంతపురం జిల్లా తర్వాత... మహిళలు, యువతులు ఎక్కువగా గల్లంతవుతున్నది హోం మంత్రి సొంత జిల్లా గుంటూరులోనే. రాయలసీమతో పోల్చితే... తూర్పు గోదావరి
జిల్లాల పరిస్థితి మరింత భిన్నమైనది. సీమ జిల్లాల్లో మహిళలను ఇతర రాష్ట్రాలకు విక్రయించే ముఠాలు పని చేస్తుండగా... ఉభయ గోదావరి జిల్లాల్లో ఏకంగా దేశమే దాటించే దుర్మార్గులున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన ఈ ప్రాంత మహిళలు కొందరు ఇటీవల ముఖ్యమంత్రికి ఒక వీడియో విన్నపం పంపించారు.
 
‘జగనన్నా మమ్మల్ని ఆదుకో... మా ప్రాంతం వాళ్లే మమ్మల్ని మోసం చేశారు’ అని వాపోయారు. ఇక్కడి అమాయక మహిళలకు ఎక్కువ డబ్బు ఆశచూపి వారి జీవితాల్నే నాశనం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్నంలో à°—à°¡à°¿à°šà°¿à°¨ ఏడు నెలల్లో తప్పిపోయిన అబలల్లో 127మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో à°† సంఖ్య 100కు చేరింది. రాజమండ్రి అర్బన్‌తోపాటు నెల్లూరు జిల్లాలోనూ మహిళల మిస్సింగ్‌ కేసులు మిస్టరీగానే ఉండిపోతున్నాయి.