భర్త వేధింపులే కారణమంటున్న బంధువులు

Published: Saturday September 14, 2019
పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ వీరంపాలెం గ్రామానికి చెందిన పరసా సత్యనారాయణ, శ్రీదేవి కుమార్తె దేవికారాణికి à°Ÿà°¿.నర్సాపురం మండలం గండిగూడేనికి చెందిన వీర మళ్ళ వీర్రాజుతో à°ˆ ఏడాది ఏప్రిల్‌ 17à°¨ వివాహమైంది. నరసాపురం తహసీల్దారు కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌à°—à°¾ పనిచేస్తున్న వీర్రాజుకు ఇటీవల ఏలూరు కలెక్టరేట్‌కు బదిలీ అయ్యింది. రెండునెలలుగా వీరంపాలెంలోని అత్తింటిలోనే ఉంటూ విధులకు వెళుతున్నాడు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్ళిన వీర్రాజు à°…à°°à°—à°‚à°Ÿ గడవక ముందే అత్తమామలకు ఫోన్‌చేసి, ఎక్కడ ఉన్నారని అడిగాడు. పొలానికి వెళ్లామని చెప్పడంతో మీ అమ్మాయి ఏదోలా మాట్లాడుతుంది. వెళ్ళి చూడండి అని చెప్పా డు.
 
తిరిగి à°…à°°à°—à°‚à°Ÿ కూడా గడవక ముందే మీ అమ్మాయి ఫోన్‌కూడా తీయడంలేదని కంగారుగా చెప్పాడు. దీంతో పరుగున ఇంటికి వెళ్ళిన అత్తమామలకు ఇంటి తలుపులు వేసి ఉండడంతో à°•à°¿à°Ÿà°¿à°•à±€ నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సహాయంతో తలుపులు తెరిచి ఆమెను కిందికి దించారు. అప్పటికే దేవికారాణి(21) మృతిచెందింది. మృతి సమాచారం తెలుసుకున్న భర్త వీర్రాజు ఏలూరు నుంచి నేరుగా పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి విషయం చెప్పాడు. పెదవేగి తహసీల్దారు ఎల్‌.దేవకీదేవి, ఎస్‌ఐ బి.మోహనరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
 
దేవికారాణి మృతికి ఆమె భర్త వీర్రాజు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. వివాహం జరిగి ఐదు నెలలు కూడా నిండక ముందే దేవికారాణి మృతిచెందడానికి కారణం వీర్రాజు మానసిక వేధింపులే కారణమని బంధువులు చెబుతున్నారు. తన స్నేహితురాలు తనపై ప్రేమను పెంచుకుందని కొద్దిరోజులుగా వీర్రాజు చెబుతున్నాడని, అయితే తనకెలాంటి ఉద్దేశం లేదని చెప్పాడని మృతురాలి తల్లి శ్రీదేవి తెలిపింది. ఎంతో నమ్మకంగా ఉండి, తన కుమార్తె ఉసురు తీశాడని ఆమె బోరున విలపిస్తోంది. తన కుమార్తె సంతోషంగా ఉండాలని, ఉద్యోగం ఉందని ఆశపడి.. స్తోమతకు మించి అడిగినంత కట్నం, ఆపై కానుకలు ఇచ్చి, ఘనంగా పెళ్ళి చేశామని ఆ తల్లి కుమార్తె మృతదేహంపై పడి రోదిస్తోంది.