డ్రైవర్‌ నిర్లక్ష్యానికి యువకుడు బలి

Published: Tuesday October 29, 2019

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిండు ప్రా ణం బలైపోయింది. లారీతో బైకును ఢీకొట్టడమే కాకుండా, ఆగకుండా వెళ్లిపోవడంతో à°“ యువకుడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. విశాఖలోని మధురవాడ ఆదిత్యనగర్‌కు చెందిన సత్యాల చరణ్‌ (25) à°“ హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్నేహితుడిని రైల్వే న్యూకాలనీలో దింపేందుకని ఇద్దరు స్నేహితులు à°’à°• బైక్‌పైన, చరణ్‌ ఒక్కడూ à°’à°• బైక్‌పైనా బయలుదేరారు. డెయిరీఫారం జంక్షన్‌ దాటుతుండగా విజయనగరం వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ చరణ్‌ బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. లారీ వెనుక చక్రాల మధ్యలో బైక్‌తోపాటు చరణ్‌ చిక్కుకుపోయాడు. లారీ డ్రైవర్‌ దీన్ని గమనించకుండా వేగంగా ముందుకు వెళ్లిపోవడంతో రోడ్డు రాపిడికి బైక్‌కు మంటలంటుకున్నాయి. కొంతమంది చూసి కేకలు వేయడంతో కృష్ణా కాలే జీ జంక్షన్‌ సమీపంలో లారీ ఆపి, పా రిపోయాడు. అప్పటికే మూడు కిలోమీటర్ల దూరం ఈడ్చుకుని రావడంతో బైక్‌ కాలిపోగా à°† మంటల్లో చరణ్‌ మృతదేహం పాక్షికంగా కాలడంతోపాటు ఛిద్రమైపోయింది. లారీని వెం బడించిన స్నేహితులు చరణ్‌ మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. తలకు హెల్మెట్‌ ఉన్నా చరణ్‌ మృత్యు వు నుంచి బయటపడలేకపోయాడంటూ విలపించారు. చరణ్‌ మఽ దురవాడలో క్రికెట ర్‌à°—à°¾ గుర్తింపు ఉండడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. పండగపూట తమ జీవితంలో చీకట్లు అలముకున్నాయని మృతుడి తల్లి, సోదరుడు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు.