దాచేపల్లి అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

Published: Thursday May 03, 2018

అమరావతి: à°—ుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
 
అలాగే ఘటనా స్థలానికి వెళ్లాలని ఎస్పీ, ఐజీలను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

తొమ్మిదేళ్ల బాలికపై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. à°ˆ ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ అర్ధరాత్రి రాస్తారోకో చేశారు. దీంతో అద్దంకి, నార్కెట్‌పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యాచారం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలిక బంధువులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికను గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని గ్రామాస్థులు డిమాండ్ చేశారు. పోలీసులు వారితో చర్చలు జరిపారు.

నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు రాస్తారోకో విరమించారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ స్థానికులు ఈరోజు దాచేపల్లి బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు నిందితుడిని పట్టిచ్చివారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.