కిడ్నాప్‌ చేసి పొలం రాయించుకున్నారు

Published: Saturday November 30, 2019
à°’à°•à°°à°¿à°•à°¿ తెలియకుండా ఒకరిని అలా ముగ్గురిని కిడ్నాప్‌ చేసి, చంపుతామని బెదిరించి 6 ఎకరాల పొలాన్ని రిజిస్టర్‌ చేయించుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. అమరావతి సర్కిల్‌ పరిధిలోని ధరణికోట గ్రామానికి చెందిన వడ్లమూడి రమే్‌షకు ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వ్యక్తి మీ పొలం కౌలుకు తీసుకుంటామని, మాట్లాడాలని పలుమార్లు ఫోన్‌చేశాడు. అక్టోబరు 19à°¨ అదే వ్యక్తి ఫోన్‌చేసి వ్యవసాయశాఖలో పనిచేసి రిటైరైన అధికారికి పొలం కౌలుకు కావాలి, మాట్లాడేందుకు జైల్‌సింగ్‌ రోడ్డు సమీపంలోని పాత విష్ణువైన్స్‌ వద్దకు రావాలని కోరాడు. రమేష్‌ అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు అతన్ని బంధించి ఆస్తి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకున్నారు. à°ˆ ముగ్గురు కాకుండా మరోవ్యక్తి ముఖానికి మాస్క్‌ ధరించి రమేష్‌ ఆస్తుల విషయం పూర్తిగా చెప్పి.. పొలంలో తనకు కొంత ఇవ్వాలనీ, లేకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించాడు.
 
à°ˆ క్రమంలో మరునాడు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన రమేష్‌ మామ హనుమంతరావు వద్దకు వెళ్లి మీ అల్లుడుకి ప్రమాదం జరిగిందని చెప్పి ఆయనను కూడా తీసుకెళ్లి బంధించారు. పొలంలో 6 ఎకరాలు తాము చెప్పిన వారి పేరున రాయకపోతే కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో హనుమంతరావు పొలం రిజిస్టర్‌ చేసేందుకు అంగీకరించాడు. అనంతరం 21à°µ తేదీన రమేశ్‌ కుమారుడు శైలేశ్‌ను కూడా అక్కడకు రప్పించిన నిందితులు హనుమంతరావు ఇంటికి ఫోన్‌ చేయించారు. హనుమంతరావు భార్య నుంచి భూముల వివరాలు, సర్వే నంబర్లు, ఆధార్‌ వివరాలు తెప్పించుకుని రిజిస్ట్రేషన్‌కు సిద్ధమయ్యారు. à°ˆ విషయం ఎవరికైనా చెప్పినా... పోలీసులకు ఫిర్యాదుచేసినా శైలేశ్‌ను చంపేస్తామని బెదిరించారు. పొలం తాలూకు సొమ్ము అందిందని రిజిస్ట్రార్‌కు చెప్పాలని సూచించారు. దీంతో హనుమంతరావు, రమేశ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్దకు వెళ్లి వారు చెప్పిన వారికి రిజిస్టర్‌ చేశారు. అనంతరం నిందితులు శైలేశ్‌ను విడిచిపెట్టారు. పదిరోజుల తర్వాత రమేశ్‌.. చెన్నైలో ఉన్న కుమార్తెను పిలిపించి, ఆస్తి రిజిస్టర్‌ చేయించుకున్న వారి వివరాలు సేకరించాడు. వాటి ఆధారంగా ధరణికోటకు చెందిన చేకూరి వెంకటేశ్వరరావు భార్య, మామ, భార్య మేనమామ పేరున ఆరు ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఉంది. రమేశ్‌ వెంటనే ఎస్పీని ఆశ్రయించగా ఆయన సూచన మేరకు అమరావతి సీఐ శివనాగరాజును కలిసి ఫిర్యాదుచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ రద్దు చేయించి, కేసులో ఎవరి ప్రమేయం ఉందో నిర్ధారించి వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.