‘కిడ్నాప్‌, ఆస్తి రిజిస్ర్టేషన్‌’లో పది మంది అరెస్టు

Published: Monday December 02, 2019
అమాయకులైన à°“ కుటుంబాన్ని సినీ ఫక్కీలో కిడ్నాప్‌ చేసి రూ.15 కోట్ల ఖరీదైన రూ.6.33 ఎకరాల పొలాన్ని తమ వారి పేరుతో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టులతో తెరదించారు. అమరావతిలో అక్టోబరు 19 నుంచి 21 మధ్య జరిగిన కిడ్నాప్‌, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, చివరికి ఆస్తుల రిజిస్ర్టేషన్‌ జరిగిన సంఘటన.. నెలా పది రోజులకు బాధితులు రూరల్‌ ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. à°ˆ కేసులో పోలీసులు ఆదివారం పది మంది నిందితులను అరెస్టు చే శారు. నిందితులను గుంటూరు పోలీస్‌ కార్యాలయంలో రూరల్‌ ఎస్పీ విజయరావు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ధరణికోటకు చెందిన వడ్లమూడి రమేష్‌ బాబుకు భార్య, కుమారుడు(9à°µ తరగతి), కుమార్తె(బీటెక్‌) ఉన్నారు. తమ పని తాము చూసుకునే కుటుంబం వీరిది. à°ˆ నేపథ్యంలో వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి ఆస్తి కాజేయాలని ధరణికోటకే చెందిన చేకూరి వెంకటేశ్వరరావు పథకం రూపొందించాడు.
 
రమేష్‌ బాబుకు మేనమామ అయిన హనుమంతరావుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకొని సేంద్రియ పంటలు సాగు చేస్తామని వెంకటేశ్వరరావు వారికి ఫోన్‌ చేసి చెప్పాడు. తాను విశ్రాంత వ్యవసాయ శాఖ అఽధికారినంటూ రమే్‌షబాబుతో 20 రోజులుగా ఫోన్‌లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. à°ˆ క్రమంలో అక్టోబరు 19à°¨ రమేష్‌ బాబును అమరావతి పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోని విష్ణు వైన్స్‌ వద్దకు రావాలని కోరాడు. రమేష్‌ బాబు అక్కడికి వెళ్లగా షెడ్‌లో నిర్బంధించాడు. తరువాత రోజు వెంకటేశ్వరరావు తన బంఽధువైన బచ్చల నారయ్య సాయంతో హనుమంతరావును కూడా షెడ్‌లో నిర్బంధించారు. తర్వాత వారితో ఇంటికి ఫోన్‌ చేయించి పొలం దస్తావేజులతో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి రావాలని చెప్పారు. అక్కడకు వెళ్లిన తరువాత రమేష్‌ బాబు కుమారుడిని కూడా కిడ్నాప్‌ చేశాడు. రమేష్‌ బాబు, హనుమంతరావులను సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. బచ్చల నారయ్య పేరుతో 2.7 ఎకరాలు, వెంకటేశ్వరరావు భార్య నాగ స్వరూప పేరుతో 1.75 ఎకరాలు, నాగ స్వరూప మేనమామ పత్తిపాటి వెంకటేశ్వర్లు పేరుతో 2.31 ఎకరాలు రిజిస్ర్టేషన్‌ చేయించారు.