రెండు పెళ్లిళ్లు రద్దు.. కేసు నమోదు

Published: Monday December 09, 2019
బ్యాంకు ఉద్యోగం, సమాజంలో హోదా. à°“ యువతితో వివాహం నిశ్చయమైంది. బంగారం, డబ్బు రూపంలో ముందుగానే కట్న కానుకలు తీసుకున్నాడు. à°† తరువాత జాతకాలు కలవడం లేదని చెప్పాడు. తీసుకున్న డబ్బు, బంగారం తిరిగి ఇవ్వకపోగా, మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మొదటి యువతి కుటుంబం à°°à°‚à°— ప్రవేశం చేసింది. పీటలపై కూచున్న వరుడికి మరో à°°à°•à°‚ ‘పెళ్లి’ చేసింది. అప్పటికే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కలకలం రేపింది. తిరుపతిలో ఎస్‌బీఐ మేనేజర్‌à°—à°¾ పనిచేస్తున్న మోహన్‌ కృష్ణకు ఆరు నెలల క్రితం మహాబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌కు చెందిన à°“ యువతితో పెళ్లి నిశ్చయమైనంది. à°† సమయంలో రూ.16 లక్షలు, 6 తులాల బంగారం కట్న కానుకల à°•à°¿à°‚à°¦ ఇచ్చారు.
 
నిశ్చితార్థం తరువాత జాతకాలు కుదరడం లేదని పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు డబ్బు, బంగారం వెనక్కు ఇవ్వాలని కోరారు. స్పందించకపోవడంతో తిరుపతి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇంతలోనే మోహన్‌ కృష్ణ నంద్యాలకు చెందిన à°“ యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇక్కడా నిశ్చితార్థం సమయంలో రూ.10 లక్షలు, 12 తులాల బంగారం, రెండు భవనాలను కట్నం à°•à°¿à°‚à°¦ తీసుకున్నాడు. విషయం తెలసుకున్న మొదటి యువతి కుటుంబ సభ్యులు కర్నూలు ఎస్పీకి, à°† తర్వాత నంద్యాల వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
 
à°ˆ నేపథ్యంలో నంద్యాల మహానందీశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం మోహన్‌కృష్ణ వివాహం జరుగుతుండగా బాధిత కుటుంబం అక్కడికి చేరుకుంది. వధువు తలపై జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో అడ్డుకుని అతనిపై దాడి చేసి చితకబాదారు. పెళ్లికి వచ్చిన బంధువులు ఏం జరుగుతోందో తెలియక ఎదురుదాడికి యత్నించారు. విషయం తెలిసి ఆందోళనకు గురయ్యారు. సమయానికి అడ్డుకోకపోతే తమ కూతురు జీవితం నాశనం అయ్యేదని వధువు తల్లిదండ్రులు కూడా వారికి మద్దతు పలికారు. à°† తరువాత రంగప్రవేశం చేసిన పోలీసులు మోహన్‌కృష్ణను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో నంద్యాలకు చెందిన వధువు కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది. నిశ్చితార్థం సమయంలో తీసుకున్న కట్నకానుకలు, బంగారం, ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలని ఇద్దరు యువతుల బంధువులు డిమాండ్‌ చేశారు. నంద్యాలలో తమ పరువు పోయిందని అందుకుగాను పరువు నష్టం, తీసుకున్న కట్నకానుకలు కలుపుకొని రూ.30 లక్షలు ఇప్పించాలని రెండో యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. à°ˆ మేరకు మోహన్‌కృష్ణ, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు.