చెల్లెలు వరుసైన బాలికపై...దారుణం..

Published: Tuesday December 17, 2019

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లెలు వరసైన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సంతబొమ్మాలి మండలం నౌపడలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఉప్పాడ సంతోష్ తనకు చెల్లెలు వరుసైన ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆ సమయంలో తీసిన వీడియోలను తాజాగా విదేశాల్లో ఉన్న బాలిక తండ్రికి పంపించాడు. దీంతో విషయం తెలిసిన బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.