ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే అరెస్ట్
Published: Friday January 10, 2020

ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే గంటల వ్యవధిలో అరెస్ట్ చేస్తామని రూరల్ ఎస్పీ విజయ్‌రావు తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తుళ్లూరులో ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకుని రైతు ఆత్మహత్య ఘటన అవాస్తవమన్నారు. మీడియా ప్రతినిధులపై ఆంక్షలు పెట్టలేదని విజయ్‌రావు స్పష్టం చేశారు.
ఇంతమంది గుమిగూడినప్పుడు కాళ్లు, చేతులు తగలడం సహజమన్నారు. మహిళలపై లాఠీచార్జ్ అవాస్తవమన్నారు. మహిళా రైతులను మహిళా కానిస్టేబుళ్లే అడ్డుకున్నారన్నారు. వృద్ధురాలు, వ్యాధిగ్రస్తులను తీసుకురావొద్దని విజయ్‌రావు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తమ అదుపులో ఉన్నవారు ఎవరూ మరణించలేదన్నారు. మత స్వేచ్ఛకు అడ్డుపడలేదని.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూశామని రూరల్ ఎస్పీ విజయ్‌రావు తెలిపారు.

Share this on your social network: