పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

Published: Thursday January 16, 2020
 à°¨à°¿à°°à±à°­à°¯, దిశ చట్టాలు వచ్చినా.. అబలలపై అత్యాచార దారుణాలు ఆగడంలేదు. నమ్మించి కాటేసే కేటుగాళ్లు.. అపహరించి అఘాయిత్యానికి పాల్పడుతున్న కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇలానే.. శుభకార్యానికి వెళ్లిన à°“ యువతికి ముగ్గురు కామాంధులు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెతో బలవంతంగా సారా తాగించి, à°’à°•à°°à°¿ తర్వాత ఒకరు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు.
 
తీవ్ర అస్వస్థతకు గురైనబాధితురాలు 20 రోజుల తర్వాత.. సోమవారం రాత్రి మృతి చెందడంతో ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (21) కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. గత నెల 24న మాచర్ల మండలంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత.. ఆమెకు తెలిసిన ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి గ్రామ శివారులోని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు.
 
అక్కడ యువతికి బలవంతంగా సారా తాగించి ముగ్గురూ అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను బంధువుల ఇంటి సమీపంలో వదిలివెళ్లిపోయారు. బాగా నీరసంగా ఉన్న ఆమెను చూసిన బంధువులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి యువతిని ఇంటికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మాచర్లలోని à°“ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు గుంటూరుకు తీసుకెళ్లాలని రిఫర్‌ చేశారు. అయితే ఆర్థిక స్థోమత లేని ఆమె కుటుంబ సభ్యులు à°† ఆస్పత్రిలో ఇచ్చిన మందులతోనే కాలం వెళ్లదీశారు.
 
యువతి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ వచ్చింది. కదల్లేని స్థితిలో ఉన్న ఆమె ఒంటిపై గాయాలను చూసి అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తమ బంధువులకు 4 రోజుల క్రితం ఫోన్‌ చేశారు. శుభకార్యం జరిగిన రోజు ఏం జరిగిందో ఆరా తీయిస్తుండగా అసలు విషయం బయటపడింది. నిందితుల బంధువులే జరిగిన దారుణం గురించి గ్రామపెద్దలకు తెలిపినట్లు తెలిసింది. à°ˆ నేపథ్యంలో సోమవారం రాత్రి బాధితురాలు మృతి చెందడంతో à°ˆ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.