ప్రేమ వల్ల మనస్తాపంచెంది విశాఖ యువకుడు ఆత్మహత్య

Published: Thursday May 17, 2018

 

జి.మాడుగుల(విశాఖ జిల్లా): ప్రేమించిన యువతి వివాహం చేసుకోలేదన్న మనస్థాపంతో ఒక యువకుడు ఉరేసుకొని ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. జి.మాడుగుల పంచాయతీ భూసిపల్లి గ్రామానికి చెందిన సిరగం రాంబాబు (23) కొత్తూరు గ్రామానికి చెందిన ఓ యువతితో కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆ యువతి కూడా కొన్ని రోజులుగా రాంబాబు ఇంట్లోనే ఉంటుంది. ఇటీవల ఆమె రాంబాబును కాదనుకొని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన రాంబాబు సోమవారం రాత్రి అందరూ నిద్రించిన తరువాత ఇంటి సమీపంలో ఉన్న చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీను తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు.