దివ్య హత్య కేసులోప్రధాన నిందితులు అరెస్ట్

Published: Sunday June 07, 2020

 à°¦à°¿à°µà±à°¯ హత్య కేసు పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలు వసంతతో పాటు మంజు, ధనలక్ష్మి, సంజయ్, కాంతవేణి, గీతను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 302, 201, 343, 324 సెక్షన్ల à°•à°¿à°‚à°¦ కేసు నమోదు చేశారు. దివ్యను వసంత హింసించి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉంది.

 

దివ్య అందాన్ని అడ్డుపెట్టుకుని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని వసంత, ఆమె సోదరి ప్లాన్ వేసుకున్నారు. దివ్యను పెట్టుబడిగా పెట్టి వసంత గ్యాంగ్ డబ్బులు సంపాదిస్తోంది. ఇలా జరుగుతున్న క్రమంలో డబ్బులు పంపకం విషయంలో దివ్య, వసంత గ్యాంగ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో దివ్యను అంతమొందించాలని వసంత గ్యాంగ్ స్కెచ్ వేసింది. అంతే తడువుగా కుట్ర ప్లాన్‌ను అమలు చేశారు. దివ్యకు గుండు గీసి, కనుబొమ్మలు కత్తిరించి, వాతలు పెట్టి ప్రాణాలు తీశారు. దివ్య మృతి చెందడంతో అదే ప్రాంతానికి చెందిన అంతిమ యాత్ర వాహనం నడిపే వ్యక్తిని వసంత సంప్రదించింది. అతడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈదారుణం వెలుగుచూసింది. కాగా, రావులపాలెం నుంచి దివ్య పిన్ని క్రాంతివేణి శనివారం రావడంతో దివ్య మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలున్నట్లు తేలగా, వీటిలో చాలావరకు అట్లకాడతో పెట్టినవే కాగా, చపాతీ కర్రతో కొట్టడం మరికొన్ని బలమైన గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. కేసును సీరియస్‌à°—à°¾ తీసుకున్న పోలీసులు.. మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. దివ్య స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాగా గుర్తించారు.