కడపలో భారీగా ఎర్రచందనం పట్టివేత
Published: Wednesday May 23, 2018

కడప జిల్లా పుల్లంపేట మండలం కొల్లవారిపల్లెలో భారీగా ఎర్రచందనం పట్టుబడ్డాయి. దాదాపు రూ. 2కోట్లు విలువ చేసే 200 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌లో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు హర్యానా వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్నారు

Share this on your social network: