భార్యభర్తలపై సైకో దాడి

Published: Thursday May 24, 2018

జిల్లాలోని తడ మండలం అక్కంపేట రైల్వేస్టేషన్ దగ్గర రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న భార్యాభర్తపై సైకో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన అజయ్‌కుమార్‌ అనే వ్యక్తి గురువారం ఉదయం అక్కంపేట రైల్వేస్టేషన్ దగ్గర రోడ్డు వెంబడి వెళ్తున్న భార్య,భర్తపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. దీంతో వారు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారంతా ఒక్క ఉదుటున అక్కడకు చేరుకుని సైకోని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా... అజయ్‌కుమార్‌ పలు చోరీ కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు