విద్యార్ధినిని ప్రేమించాడు.. ఆమె తిరస్కరించడంతో

Published: Monday May 28, 2018

à°’à°• ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన కొచ్చెర్ల రఘు (32) నగర శివార్లలోని కొత్తూరులో ఉంటూ .. à°’à°• ప్రైవేటు కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. అతనికి మహబూబాబాద్‌కు చెందిన యువతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల అనంతరం ఇద్దరూ వివాదంతో విడిపోయారు. ఇటీవల రఘు à°’à°• విద్యార్థినిని ప్రేమించడం, ఆమె తిరస్కరించటంతో మనస్థాపానికి గురై తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈవిషయాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు అతడి తండ్రికి సమాచారం అందిం చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.