మహిళా భక్తులకు లైంగిక వేధింపులు... పూజారిని నగ్నంగా చేసి...

Published: Saturday June 02, 2018

భక్తిప్రపత్తులతో ఆలయానికి వచ్చే మహిళా భక్తులను లైంగికంగా వేధించినందుకు ఓ పూజారిని నగ్నంగా చేసి ఊరేగించడమే కాకుండా బడితపూజ కూడా చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో చోటుచేసుకున్న ఈ వివరాలను పరిశీలిస్తే

బెలగావి, షంబాజీ రోడ్‌లో కపిలేశ్వర ఆలయం ఉంది. ఇందులో పూజారి గోపాలయ్య(రామ పూజారి) పని చేస్తున్నారు. ఈయన కొన్ని నెలలుగా ఈ ఆలయానికి వచ్చే మహిళా భక్తులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీనిపై పలువురు మహిళలు హెచ్చరించినా ఆయన తీరు మాత్రం మారలేదు. పైపెచ్చు మహిళా భక్తులను అసభ్య పదజాలంతో కామెంట్స్ చేయసాగాడు. 
 
ఈ పరిస్థితుల్లో సాయంత్రం వేళ గుడికొచ్చిన ఓ భక్తురాలిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని చితకబాది ప్యాంట్‌ ఊడదీయించి ఊరేగించారు. ఆ సమయంలో ఆయన అనుచరులు దాడికి పాల్పడిన వారిపై యాసిడ్ దాడికి యత్నించారు. ఆ వీడియోలు స్థానికంగా పలు ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.