అంబులెన్సులో గంజాయి స్మగ్లింగ్...

Published: Monday June 04, 2018

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు వాడాల్సిన అంబులెన్స్‌ను గంజాయి స్మగ్లింగ్ ఉపయోగిస్తున్న వైనమిది. ఛత్తీస్‌గఢ్‌లోని కార్బా జిల్లా కాట్‌ఘోరాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ మాటున గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాని పోలీసులు పసిగట్టి పట్టుకున్నారు. పెద్ద ఎత్తున గోనె సంచుల్లో కుక్కిన 970 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ.40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.