కేజీహెచ్‌లో మహిళ ఆత్మహత్య

Published: Thursday April 15, 2021

విశాఖ: కేజీహెచ్‌లో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సీఎస్ఆర్ బ్లాక్ భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కరోనా రోగుల కోసం సీఎస్ఆర్ బ్లాక్ ఏర్పాటు చేశారు. కరోనా సోకడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.