బాలికపై సోదరుడు ఐదు నెలలుగా అత్యాచారం.....

Published: Friday June 15, 2018

సోదరుడే కుమార్తెను గర్భవతిని చేయడంతో à°† తల్లి పోలీసులను ఆశ్రయించింది. వివరాలు...నెల్లూరు జిల్లా కొనదిన్నె గిరిజనకాలనీకి చెందిన బాలిక తండ్రి ఏడాది కిందట మృతి చెందాడు. దీంతో బాలికను, ఆమె తల్లిని మేనమామ చేరదీశాడు. ఐదు నెలలుగా అతను మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక కడుపులో నొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో వైద్యపరీక్షలు చేయించగా మూడు నెలల గర్భిణి అని తేలింది. దీంతో బాలికను నిలదీయగా మేనమామ నిర్వాకం బయటపడింది. గురువారం రాత్రి కావలి ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది.