కూతురిని చంపిన తల్లి... తల్లిని చంపిన కొడుకు
Published: Thursday October 21, 2021
జిల్లాలోని నకాశ్ వీధిలో జంట హత్యల కలకలం రేగింది. ఎక్కువగా మొబైల్ చూస్తుందని కూతురిని తల్లి మందలించింది. ఆవేశంతో కుమార్తె హలీం(14)ను తల్లి ఖుర్షీదా చున్నీతో హత్య చేసింది. ఘటనను చూసి తట్టుకోలేక కొడుకు జమీర్ తల్లిని కత్తితో పొడిచి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Share this on your social network: