రైళ్లలో దోపిడీ.....11 తులాల బంగారం, రూ.10 వేలు అపహరణ

దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించి రైలు ప్రయాణికులను దోచుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి జీఆర్పీ స్టేషన్ పరిధిలోని జూటూరు-జక్కల చెరువు రైల్వేస్టేషన్ల మధ్య గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. చిత్తూరు నుంచి కాచిగూడకు వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కొద్దిసేపట్లో జక్కల చెరువు స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. దుండగులు సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేయడంతో జూటూరు ఔటర్ వద్ద రైలును ఆపారు. ఇంతలో ఒక్కసారిగా ఎస్-2 బోగీ మొదలు పది బోగీలపై దుండగులు రాళ్లతో దాడిచేశారు. మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించి 11 తులాల బంగారు నగలు, రూ.10వేలు నగదు అపహరించారు. కాగా, ఈ సంఘటన జరిగిన గంట వ్యవధిలో అదేమార్గంలోని జక్కలచెరువు ఔటర్‌లో సిగ్నల్ వ్యవ స్థ ధ్వంసం చేయడంతో నాంపల్లి నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. దుండగులు ప్రయాణికుల వద్ద బంగారు నగలు, నగదును అపహరించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు కాచిగూడలో, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు తిరుపతిలో ఫిర్యాదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Share this on your social network: