ఇద్దరి మిత్రుల మధ్య చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం

Published: Sunday June 24, 2018

 వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒకరిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్లు కట్టా పరశురాం, పరసా విజయకృష్ణ స్నేహితులు. విజయకృష్ణ సోదరితో పరశురాం వివాహేతర సంబంధం నడుపుతున్నాడన్న అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని విజయ కృష్ణ, పరశురాంతో చెప్పాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ మార్పు రాకపోవటంతో శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేయగా పరశురాం గాయపడ్డాడు. పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.