ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం
Published: Friday July 13, 2018

విజయవాడ: ప్రేమ పేరుతో యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నగ్నంగా ఫొటోలు తీసి ఎవరితోనైనా చెబితే ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించాడు. ఎవరితో చెప్పకుండా ఉంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతి పెళ్లి చేసుకోమని అడగటంతో రెండు నెలలుగా ముఖం చాటేశాడు. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం టైనర్ పేటకు చెందిన యువతి (20)కి తల్లిదండ్రులు చనిపోవడంతో మతిస్థిమితం లేని అన్నతో కలసి స్కూల్లో పని చేసుకొని జీవనం సాగిస్తోంది. స్కూల్లో క్రికెట్ ఆడుకునేందుకు అదే ప్రాంతానికి చెందిన పొట్నూరి లక్ష్మణ్ వస్తుండేవాడు. యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొన్ని నెలల క్రితం ఇంట్లో వారికి పరిచయం చేస్తానని తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యువతి భయపడి బయటకు వచ్చేస్తుండగా తన వాళ్లు వస్తున్నారని చెప్పి నమ్మించాడు. ఇంతలో కూల్ డ్రింక్ తాగమని దానిలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ కోల్పోగానే అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this on your social network: