జంట హత్యలు కలకలం

Published: Wednesday July 25, 2018

గుంటూరు జిల్లా చుండూరులో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త ఆమెపై రోకలిబండతో దాడి చేశాడు. అడ్డువచ్చి అత్తపైనా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో భార్య, అత్త అక్కడిక్కడే మృతి చెందారు. గ్రామస్థుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.