ఎస్‌ఐ, హోంగార్డుపై మత్స్యకారుల దాడి

సముద్ర తీర గ్రామంలో రికార్డింగ్ డ్యాన్స్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై మత్స్యకారులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బుధవారం అర్ధరాత్రి కావలి రూరల్ మండలం కొత్తసత్రంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో రూరల్ ఎస్‌ఐ పుల్లారావుతో పా టు కానిస్టేబుల్స్ క్రిష్ణయ్య, ప్రేమ్‌కుమార్, హోంగార్డులు రామచంద్రయ్య, నాగరాజు గాయపడ్డారు. ఎస్‌ఐ పుల్లారా వు, హోంగార్డు నాగరాజును మత్స్యకారులు చేతులతో పిడిగుద్దులు గుద్ది చితకబాదారు. వీరిద్దరు కావలి ఏరియా వైద్యశాలలో ప్రథమ చికిత్స పొందారు. ఎస్‌ఐ పుల్లారావు ఫిర్యాదు మేరకు 60 మంది మత్స్యకారులపై హత్యాయత్నం, ప్రభుత్వ అధికారులను అటకాయించడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రూరల్ సీఐ అశోక్‌వర్ధన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు కావడంతో కొత్తసత్రంలో పురుషులంతా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల, స్థానికుల కథనం మేరకు కొత్తసత్రంలో యు వకులు తరచూ మంగళూరుకు చేపల వేటకు వెళ్తు, తిరిగి వస్తుంటారు. బుధవారం రాత్రి అలా వెళ్లివచ్చిన యువ కులు కలిసి పార్టీ చేసుకునేందుకు నిర్ణయించుకుని తీరంలో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అర్ధరాత్రి సమయంలో ఎస్ ఐ పుల్లారావు తన సిబ్బందితో కలిసి ఆ గ్రామానికి వెళ్లే సరికి సముద్రతీరం వద్ద రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతోంది. పోలీసులను చూడగానే డ్యాన్సర్లు అ క్కడ నుంచి పరారయ్యారు. అక్కడ గుమికూడిన ప్రజలను హోంగార్డు నా గరాజు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా దానిని గమనించిన యువకులు ఆయనను చితకబాదారు.

Share this on your social network: