ప్రేమ వివాహం.. విషాదం

Published: Saturday July 28, 2018

పట్టణంలోని కొత్తపేట డిష్‌ రెడ్డెన్న వీధిలో కాపురం ఉంటున్న చందన(27) అనే వివాహిత గురువారం అర్ధరాత్రి ఉరేసుకుని మృతి చెందింది. ఈవిషయం తెలుసుకున్న భర్త శ్రీనాధ్‌రెడ్డి, కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రే ఆమె మృతదేహాన్ని వీరబల్లి మండలం గడికోట మాలవాండ్లపల్లెకు తరలించారు. వీరిది ప్రేమవివాహం. వీరికి ఐదేళ్ల వయసు ఉన్న పాప ఉంది. ఈవిషయం ఆనోట ఈనోట పోలీసులకు చేరడంతో అర్బన్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గోవిందరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.