కాలం చెల్లిన మందుల సరఫరాపై చర్యలు

Published: Thursday August 02, 2018

మూడునెలల్లో కాలం చెల్లే మందులను ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయడంపై తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య చెప్పారు. బుధవారం జగ్గయ్యపేటలో ప్రభుత్వాసుపత్రి సందర్శనకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. మూడునెలల్లో కాలం చెల్లే మందులను సరఫరా చేయకూడదని, ఫార్మాసి్‌స్టలు డ్రగ్‌ స్టోరేజి సెంటర్‌కు తెలియజేయగానే వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈవిధమైన మందులు జగ్గయ్యపేటతో పాటు పలు పీహెచ్‌సీలకు సరఫరా కావటంపై తగుచర్యలు తీసుకుంటామని చెప్పారు.