రౌడీషీటర్ దారుణ హత్య....
Published: Friday August 03, 2018

విశాఖపట్నం: విశాఖలో రౌడీషీటర్ కాశిం దారుణహత్యకు గురయ్యాడు. కాశింను దుండగులు కత్తులతో నరికి చంపేశారు. పాతకక్షలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హత్య జరిగిన స్థలానికి క్లూస్, డాగ్ స్క్వాడ్ చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి.
విశాఖ ఎల్‌ఐసీ రోడ్డులో గత రాత్రి కాశిం బైక్‌పై వెళ్తున్నాడు. అతడిని వెంబడించిన ప్రత్యర్థులు వెనక నుంచి కత్తితో కాశింపై దాడి చేశారు. దీంతో కాశిం కిందపడిపోయాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు కాశిం తల, మెడపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఆ వెంటనే నిందితులంతా ఆటోలో పరారయ్యారు. ఈ ఘటన చూసినవారంతా భయబ్రాంతులకు గురయ్యారు. నగర పోలీస్‌కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ హత్య చిట్టిమామ్లీయే చేశారని కాశిం కుటుంబసభ్యులు ఆరోపించారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక నుంచి రౌడీయిజాన్ని అరికడతామని వారి ఆటలు సాగనివ్వమని పోలీసులు చెప్పారు.

Share this on your social network: