పెద్దలు పెళ్లికి అంగీకరించరని నిరాశతో .. గూడ్స్‌ రైలుకింద పడిన వైనం

Published: Saturday August 04, 2018
 à°µà°¾à°°à°¿à°¦à±à°¦à°°à±‚ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పుకోరనే నిరాశతో రైలు à°•à°¿à°‚à°¦ పడి ఆత్మహత్య చేసుకున్నారు. బేతంచెర్ల -బుగ్గానిపల్లె రైల్వేస్టేషన్‌ వద్ద నంద్యాల వైపు వెళ్తున్న à°“ గూడ్స్‌ రైలు à°•à°¿à°‚à°¦ పడి బేతంచెర్ల పట్టణానికి చెందిన సురేంద్ర (22), హారిక (17) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం à°ˆ ఘటన జరిగింది. బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన లక్ష్మీదేవి, హుస్సేనయ్య దంపతుల కుమారుడు సురేంద్ర పదో తరగతి పూర్తి చేసి పట్టణంలోని పాత బస్టాండులో ఉన్న సుధాకర్‌ సెల్‌ పాయింట్‌లో à°—à°¤ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు.
 
 
పట్టణంలోని కొత్తబస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న లక్ష్మీరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె హారిక కొత్త బస్టాండు సమీపంలోని జూనియర్‌ కళాశాలలో వారం రోజుల క్రితం చేరింది. వీరివురూ à°—à°¤ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఆటోలో బేతంచెర్ల రైల్వేస్టేషన్‌కు వచ్చి అక్కడ్నుంచి బుగ్గానిపల్లె వైపు ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తూ బేతంచెర్ల నుంచి 1 కిలోమీటర్‌ దూరంలోని మైలురాయి 295/3 వద్ద గూడ్స్‌ రైలు à°•à°¿à°‚à°¦ పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు à°•à°¿à°‚à°¦ పడడంతో వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. తల, మొండెం వేరైపోయాయి. à°ˆ విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వెళ్లారు. తల, మొండెం వేరుగా పడి పోయిన మృతదేహాలను చూచి బోరున రోదించారు. నంద్యాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను నంద్యాల రైల్వే ఆస్పత్రికి తరలించారు.